Saturday, April 20, 2024

Telangana: స్వగృహ ఫ్లాట్ల దరఖాస్తుకు నేటితో లాస్ట్​ చాన్స్​.. 22న లాటరీ పద్ధతిలో ఫ్లాట్ల అప్పగింత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బండ్లగూడ, పోచారంలోని ప్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. 2971 ప్లాట్లకుగానూ రూ.900 కోట్ల ఆదాయం వస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం వరకు 36వేల వరకు దరఖాస్తులు అందినట్లు హౌసింగ్‌ అధికారులు చెప్పారు. మంగళవారం మరో వెయ్యి వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గడువును పొడిగించబోమన్నారు. ఈ ఫ్లాట్లను మే 12న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజుతో(14న) ముగియనుంది.

ప్రతి దరఖాస్తుకు రూ.వెయ్యి(నాన్‌ రీఫండబుల్‌) ఫీజును వసూలు చేస్తున్నారు. ఇలా దరఖాస్తు రూపంలో రూ.3.60 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. సింగిల్‌, డబుల్‌, త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌లతో పాటు త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ డీలక్స్‌ ఫ్లాట్లను అమ్మకానికి ఉంచారు. ఒక్కో చదరపు అడుగుకు రూ.3వేలు, రూ.2750గా ధర నిర్ణయించారు. ఇక్కడ ఫ్లాట్లు రూ.18 లక్షల నుంచి రూ.50 లక్షలలోపు ఖరీదులోనే రానుండటంతో అప్లికేషన్లు భారీగా వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు.

బహిరంగ మార్కెట్‌తో పోల్చుకుంటే వీటి ధర తక్కువే అంటున్నారు. ఇదిలా ఉండగా హౌసింగ్‌ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాలను సైతం విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు చపడుతోంది. ఈక్రమంలో ఖాళీ స్థలాలకు సంబంధించిన వివరాలను హెచ్‌ఎండీఏకు ఇవ్వాలని హౌసింగ్‌ శాఖకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. వీటన్నింటికి హెచ్‌ఎండీఏ వేలం ద్వారా విక్రయించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement