Sunday, December 8, 2024

Lagacharla – లగచర్లలో హైటెన్షన్ – పోలీస్ లు రౌండ్ అప్ – 30 మంది అరెస్ట్

వికారాబాద్‌ జిల్లా లగచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. జిల్లా కలెక్టర్‌తోపాటు అధికారులపై దాడి ఘటనలో 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి వేల లగచర్లలో భారీగా మోహరించిన పోలీసులు.. కరెంటు తీసేసి ప్రతి ఇంటిని జల్లడపట్టారు.

అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్లను అడ్డుకున్నారు. ఫొటోలను డిలీట్‌ చేయించి.. అక్కడిని పంపించారు. దుద్యాల, కొడంగల్‌, బొంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. పోలీసుల జులుంపై తండా వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement