Friday, April 19, 2024

వీడిన కూకట్‌ పల్లి హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం దోపిడీ కేసు

కూకట్‌పల్లి హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం దోపిడీ కేసులో మిస్టరీ వీడింది. ఇద్దరు పాత నేరస్తులు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దోపిడీలో పాల్గొన్న ఇద్దరిలో ఒకరు పోలీసులకు చిక్కినట్లు సమాచారం. ఈ ఇద్దరు గతంలో దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారి దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది. వీరు గతంలో జైలుకు వెళ్లి వచ్చారని పోలీసులు చెబుతున్నారు.  ఏప్రిల్‌ 16న జీడిమెట్ల పరిధిలో ఓ మనీ ట్రాన్స్‌ఫర్‌ సంస్థలో  నేరస్తులు తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ దోపిడీ కేసును చేధించేందుకు పోలీసులు పన్నెండు బృందాలు ఏర్పాటు చేశారు. దుండగుల్లో ఒకరిని నగరంలోనే పట్టుకోగా…మరొక దుండగుడు తుపాకీ, డబ్బుతో పరారయ్యాడు.  ఇద్దరిలో ఒకరు బీహార్‌కు చెందినవాడు కాగా, మరోకరు మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన వాడుగా గుర్తించారు. జీడిమెట్ల దోపిడీలో పరిచయం ఉన్న వ్యక్తి బైక్‌ను ఏటీఎం చోరీ ఘటనలో వాడారని తెలుస్తోంది. ఈ ఇద్దరు దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్నారని, గత కాలంగా రోజువారి కూలీలుగా పని చేస్తున్నట్లు పోలీసు రికార్డులో ఉంది.

కాగా, రెండు రోజుల క్రితం కూకట్ పల్లిలో ఏటీఎం వద్ద కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏటీఎంలో డబ్బులు నింపుతున్న వారిపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి నగదుతో బైక్ పై పరారయ్యారు. దుండగుల కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు అలీ ప్రాణాలు విడిచాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement