Thursday, November 7, 2024

TG: మంత్రి కొండాపై కేటీఆర్ పరువు నష్టం దావా…

హైదరాబాద్: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఇటీవ‌ల ఆయ‌నపై చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని కోరుతూ కేటీఆర్ ఇప్ప‌టికే లీగల్ నోటీస్ ను మంత్రికి పంపారు..

అయితే ఆమె నుంచి ఆ నోటీస్ కు ఎటువంటి స్పంద‌న లేక‌పోవ‌డంతో ఇక న్యాయ పోరాటానికి దిగారు కేటీఆర్.. ఈ నేప‌థ్యంలోనే కేటీఆర్ తరపు న్యాయవాది ఉమామహేశ్వర రావు ఇందుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ ను కేటీఆర్ సాక్షులుగా పేర్కొన్నారు. ఇక ఈ పిటిష‌న్ పై విచార‌ణ‌కు కోర్టు ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేదు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement