Saturday, April 20, 2024

KTR అక్షరాలతో నారు మడి.. ఎవరీ అభిమాని?

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై ఓ యువ రైతు త‌న‌కున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రేమ‌తో వ‌రుస‌గా రెండోసారి.. త‌న నారు మ‌డిలో KTR అనే అక్ష‌రాల‌తో నారు పోసి పెంచాడు. దీనిని ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తన అభిమానికి కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు.

క‌రీంన‌గ‌ర్ జిల్లా రామ‌డుగు మండ‌లం వెదిర గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ యువ కార్య‌క‌ర్త శ‌నిగార‌పు అర్జున్‌కు కేటీఆర్ అంటే ఎంతో అభిమానం. దీంతో గ‌తేడాది కూడా త‌న పొలంలో KTR అనే అక్ష‌రాల ఆకారంలో నారు పోసి, పెంచి త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. వరుసాగా రెండో ఏడాది కూడా తన నారు మడిలో KTR అని అక్షరాలతో నారును పెంచాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement