Friday, April 19, 2024

కెటిఆర్ చేతుల మీదుగా అమెజాన్ ఎయిర్ కార్గో ప్రారంభం..

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో అమెజాన్‌ ఎయిర్‌కార్గో విమానమైన ప్రైమ్‌ ఎయిర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెజాన్‌ బృందాన్ని అభినందించారు. ఇప్ప‌టికే అమెజాన్‌ అతిపెద్ద క్యాంపస్‌ హైదరాబాద్‌లోనే ఉందని గుర్తు చేశారు.. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ ద్వారా రూ.36వేల 300 కోట్ల పెట్టుబడులు పెడుతున్నదని చెప్పారు. ఏవియేషన్‌ రంగంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. హైదరాబాద్‌ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్‌ అని చెప్పారు. హైదరాబాద్‌ గ్రీన్‌సిటీ అవార్డును సొంతం చేసుకున్నదని తెలిపారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇండియన్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని చెప్పారు. గత ఏడేండ్లుగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement