Sunday, April 14, 2024

Breaking: కొత్త‌గూడెం ఎస్పీ సునీల్ ద‌త్ బ‌దిలీ.. కొత్త ఎస్పీగా వినీత్‌కు బాధ్య‌త‌లు

భ‌ద్ర‌ద్రి కొత్త‌గూడెం జిల్లా ఎస్పీ సునీల్​ దత్‌ని​ బదిలీ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. ఆయన ప్లేస్​లో ఇప్పటికే అక్కడ ఆపరేషన్స్​ ఆన్​ స్పెషల్​ డ్యూటీపై (ఓఎస్‌డీ) ఉన్న‌ ఐపీఎస్ ఆఫీసర్​ డాక్టర్​ వినీత్​కు బాధ్యతలు అప్పగించారు. ఈమేర‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ నుంచి ఆదేశాలు అందాయి. అయితే.. ఏజెన్సీ ఏరియాలో సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చికున్న ఎస్పీ సునీల్​ దత్​ అకస్మిక బదిలీకి కారణాలు తెలియ‌డం లేదు. సునీల్​ దత్​ని డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశాలు వెలువ‌డ్డాయి. అంతేకాకుండా భ‌ద్రాచ‌లం ఏఎస్‌పీగా రోహిత్ రాజుని నియ‌మించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement