Tuesday, September 19, 2023

kothagudem : రైతు దినోత్స‌వం.. పంచె కట్టులో తళుక్కుమన్న కలెక్టర్ అనుదీప్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆహార్యం మారింది. అచ్చు రైతులా ఆయన పంచె కట్టులో కనిపించారు. తెల్లటి చొక్కా, జరీ అంచు పంచెలో మెరిసిపోయారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు .. తెలంగాణ రైతు దినోత్సవం జరుగుతోంది . జిల్లాలోని 67 వ్యవసాయ క్లస్టర్ల రైతు వేదికలు సంబరాలుకు సిద్ధం చేసిన కలెక్టర్ అనుదీప్ సంప్రదాయ దుస్తుల్లో .. పాల్వంచ మండలంలోని జగన్నాథపురం రైతు దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. విధి నిర్వహణలో ఎపుడు ఫాంట్, షర్ట్ ఇన్సర్ట్ ధరించే కలెక్టర్ సంప్రదాయ దుస్తులతో, మెడలో పచ్చని కండువా ధరించి,హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రైతు దినోత్సవ వేడుకలకు భారీ సంఖ్యలో హాజరైన రైతులు కలెక్టర్ ని పంచెకట్టులో చూసి ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement