Tuesday, April 23, 2024

భారీ వర్షాలకు నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి..

గత రెండుమూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక భద్రాద్రి కొత్తగూడేం జిల్లాలో కూడా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇల్లెందులోని సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాల కారణంగా ఇల్లెందు గునుల్లో ఐదు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. అదేవిధంగా 30 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు ఆగిపోయాయి. కాగా, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనిప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇది కూడా చదవండి: డైరెక్టర్ శంకర్ కూతురు సినిమా ఫస్ట్ లుక్ విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement