Friday, April 26, 2024

మహిళలు స్వశక్తితో అభివృద్ధి చెందాలి : మంత్రి పువ్వాడ

సత్య మార్గం సొసైటీ, సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి వారికి TANA తరుపున సామినేని ఫౌండేషన్ చైర్మన్ సామినేని రవి సమకూర్చిన 33 కుట్టు మిషన్ లను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదగా పంపిణీ చేశారు. అనంతరం స్థానిక వృద్దులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ మాట్లాడుతూ.. మ‌హిళ‌లు స్వ‌శ‌క్తితో అభివృద్ధి చెందాల‌న్నారు. మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్, కార్పొరేటర్ కర్నాటి కృష్ణా, మాడురి ప్రసాద్, ఆళ్ల నిరిషా రెడ్డి, దాదే అమృతమ్మ, శ్రీలక్ష్మి, TANA ఫౌండేష‌న్‌ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ, స్ధానిక సమన్వయకర్త బండి నాగేశ్వరరావు, నాయకులు మెహబూబ్ అలీ, అన్నం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement