Tuesday, October 8, 2024

Missing | ఇద్దరు హాస్టల్‌ విద్యార్థినులు అదృశ్యం.. తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన

సత్తుపల్లి, ప్రభన్యూస్‌: సత్తుపల్లిలోని గిరిజన బాలికల ప్రభుత్వ వసతి గృహంలోని ఇద్దరు బాలికలు రెండు రోజులుగా కనిపించడం లేదు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు హాస్టల్‌ ఎదుట మంగళవారం ఆందోళనకు దిగారు. మిస్సింగ్‌ బాలికల్లో ఒకరు సత్తుపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్థిని గద్దల శైలజ కాగా, ఇంకొకరు కొత్తగూడెం నివాసి 9వ తరగతి విద్యార్థిని కంచెపోగు రాజేశ్వరి ఉన్నారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, బంధువులు హాస్టల్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు.

వార్డెన్‌ నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. ఒకవైపు ఆందోళన సాగుతుండగా మరోవైపు హాస్టల్‌ వార్డెన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని బాలికల మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశారు. బాలికలు ఎక్కడికి వెళ్లారు, ఎటు- వెళ్లారనే వివరాలు ఇంకా తెలియ రాలేదు. వాళ్ల ఆచూకీ కోసం పోలీసులు విచారణ ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement