Thursday, April 25, 2024

ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం : మంత్రి పువ్వాడ

రఘునాధపాలెం : సామాన్యుడికి అధునాతనమైన, మెరుగైన వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రఘునాధపాలెం మండలం కేంద్రంలో రూ.20 లక్షలతో నిర్మించిన ప్రాధమిక అరోగ్య ఉప కేంద్రంను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఖమ్మం కార్పోరేషన్ 16వ డివిజన్ లో రూ.16 లక్ష‌లతో ఏర్పాటు చేసిన ప్రాథమిక అరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైద్య రంగాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దడం, పేదలు, సామాన్యులకు చెంతనే కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ వైద్యాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి సామాన్యుడి చెంతకు చేర్చారన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక పరిజ్ఞాన యంత్రాలతో కార్పొరేట్ స్థాయికి మించి సామాన్యుడికి మెరుగైన వైద్యం అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఆసుపత్రులను ఆధునీకరించిందన్నారు. గ్రామంలోని క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్కరికి ఇదే తరహాలో వైద్యాన్ని అందించాలని దృడ సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తుందని వివరించారు. ప్రజలు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని కోరారు. వానాకాలం వచ్చిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం గా ఉంచుకోవాలన్నారు. హెల్త్ సెంటర్ లో మందులు అందుబాటులో ఉంచుకోవాలని, హెల్త్ సెంటర్ పరిధిలోని గ్రామాల్లోని అరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement