Saturday, April 20, 2024

తెలుగు చలనచిత్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటిన RRR : మంత్రి పువ్వాడ

ఖమ్మం : భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై ఆస్కార్ పురస్కారాన్ని స్వీకరించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ లకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ వార్తను చూడగానే ఎంతో సంతోషించాను. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నిలిచిన RRR చిత్రంలో ‘నాటు నాటు’ గీతంకు ఆస్కార్ లో స్థానం దక్కడం పట్ల తెలుగు చలనచిత్ర రంగం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిందన్నారు. ఆ హుషారు ఈ రోజు ఆస్కార్ వేదిక మీద రెట్టించిన ఉత్సాహంతో కనిపించింది. ఈ వేదికపై ఈ గీతాన్ని ప్రదర్శించడంతో పాటు అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరిందని, ఇంతటి ఘనత పొందేలా ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రాన్ని రూపొందించిన దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆ చిత్రంలో కథానాయక పాత్రల్లో ఒదిగిపోయిన జూ.ఎన్టిఆర్, రాంచరణ్ గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నృత్య దర్శకులు ప్రేమ్ రక్షిత్, చిత్ర నిర్మాత డి.వి.వి.దానయ్యలకు అభినందనలు తెలిపారు. RRR చిత్రానికి దక్కిన ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుతోపాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు భారతీయ దర్శకులు, నటులు, రచయితలకు స్ఫూర్తినిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement