Friday, October 11, 2024

KHM: ఢిల్లీ మ్యాజిక్ ఫెస్టివల్ జాదూ ఉత్సవ్ -2024.. అవార్డు అందుకున్న మస్తాన్

ఢిల్లీలో నిర్వహించిన ఢిల్లీ మ్యాజిక్ ఫెస్టివల్ జాదూ ఉత్సవ్ కార్యక్రమంలో ఖమ్మం నగరానికి చెందిన మేజీసియన్ మస్తాన్ కు అవార్డు దక్కింది. జాతీయ స్థాయిలో ఉన్న మేజీషియన్లు గుర్తించి వారి ప్రతిభకు, వారి సేవకు అభినందిస్తూ వారికి ఉత్తమ మెజీషియన్ అవార్డు అందించడం జరిగింది. ఖమ్మం నగరంలో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రకాల ఇంద్రజాల ప్రదర్శనలో ప్రజలను అలరించిన ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ బాజీ మస్తాన్ కు ఈ అవార్డు రావడం గర్వించదగ్గ విషయం.

అంతే కాకుండా మస్తాన్ పాములను పట్టడంలో కూడా మంచి ప్రావీణ్యం ఉన్నవ్యక్తి. వరద సమయంలో ముంపు ప్రాంతాల్లో ఉంటున్న వారి నివాసాల్లో చేరిన పాములని పట్టి వారికీ సహాయం చేశారు. ఈ అవార్డును ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇంటర్ నేసషనల్ మ్యాజిక్ స్టార్ట్ జాదుగర్ స్మార్ట్ శంకర్, ఐఎంబి ఢిల్లీ మ్యాజిక్ ఫెస్టివల్ హోల్డర్ అండ్ ఢిల్లీ మెజీషియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్, గిన్నిస్ బుక్ అఫ్ రికార్డు గ్రహిత అశోక్ ఖర్బందా చేతుల మీదుగా అందుకున్నారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ అవార్డు పొందడం తనకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు. ఈ అవార్డుకు తనను ఎన్నుకున్న కమిటీ వారికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో రకాల కొత్త విన్యాసాలతో ప్రజలను అలరిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని మస్తాన్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement