Thursday, May 26, 2022

విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్య

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తురకలగూడేనికి చెందిన మ‌డ‌కం సోనా, దేవీ అనే యువ‌తిని గ‌త కొంత‌కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. అయితే దేవీకి ఇటీవ‌లే పెళ్లి సంబంధం కుదిర్చారు. దీంతో మనస్తాపం చెందిన యువతి మూడు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్య‌మైంది. సోమవారం రాత్రి అన్నారం శివారు అటవీ ప్రాంతంలో గ్రామస్తులు రెండు మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘ‌ట‌నాస్థ‌లిలో ఉన్న పురుగుల మందు డ‌బ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను పాల్వంచ ఆస్ప‌త్రికి తరలించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement