Friday, October 4, 2024

Khammam – ప్రజల భద్రతే ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి పువ్వాడ

ఖమ్మం :రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని, ప్రజల భద్రతే ప్రధాన కర్తవ్యం గా పోలీస్ వ్యవస్థ నిర్విరామంగా పని చేస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ, జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ అధ్వర్యంలో చేపట్టిన సురక్ష దినోత్సవం కార్యక్రమాల్లో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని SR & BGNR కాలేజ్ గ్రౌండ్స్ నుండి చేపట్టిన పోలీసుల వాహనల ర్యాలీని జెండా ఊపి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , ఎంపి లు నామా నాగేశ్వర రావు , వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు ప్రారంభించారు.

.SR&BGNR గ్రౌండ్స్ నుండి ప్రారంభమై ఇల్లందు సర్కిల్, ఐటి హబ్, జిల్లా కోర్టు, ఇందిరా నగర్ సర్కిల్, మీదగా చెన్నై షాపింగ్ మాల్, జెడ్పీ సెంటర్, జమ్మి బండ, తుమ్మల గడ్డ, చర్చ్ కాంపౌండ్, శ్రీనివాస్ నగర్, ప్రకాష్ నగర్ పోలీస్ కమాండ్ కంట్రోల్, బోస్ బొమ్మ సెంటర్, గ్రైన్ మార్కేట్, హర్కర బావి సర్కిల్, గణేష్ గంజ్, గాంధీ చౌక్, psr రోడ్, నయా బజార్, కల్వోడ్డు, జూబ్లీ క్లబ్, మయూరి సెంటర్ మీదగా పాత బస్ స్టాండ్ వరకు భారీ పోలీస్ వాహనాలతో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..పెరుగుతున్న జనాభా, నేరాలు, సైబర్ క్రైమ్ వంటి సాంకేతికతో ముడిపడి ఉన్న నేరాల వంటి సవాళ్ళను ఎదుర్కునేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధ మై ఉందన్నారు.

మహిళల భద్రత విషయంలోనూ హోం శాఖ పటిష్ట కార్యాచరణను అమలు చేస్తున్నదని అందుకు తగు ప్రణాళికలు చేసి విజయవంతంగా అమలు చేస్తున్నదన్నారు.ఖమ్మం జిల్లాలో పోలీస్ పని తీరు అద్భుతంగా ఉందని వారి సేవలను మంత్రి కొనియాడారు.రాష్ట్ర ప్రభుత్వ పటిష్ట నిర్ణయాల వల్ల అరాచక శక్తులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై ఉక్కు పాదం మోపడం జరిగిందన్నారు.తెలంగాణా పోలీస్ శాఖ శాంతి భద్రతల నిర్వహణలో అద్భుతంగా పని చేస్తోందని, దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు.ఖమ్మంను కమిషనరేట్ గా చేసుకుని ప్రజల భద్రతతో పాటు శాంతి భద్రతలో అద్భుతంగా పని చేస్తుందన్నారు.కమిషనరేట్ ఏర్పాటు వల్లే నేరాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు.

- Advertisement -

. ప్రజా శ్రేయస్సు కోసం అవసరమైన అన్ని రకాల తోడ్పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందిస్తామని తెలిపారు.నేడు దేశంలోనే తెలంగాణ అత్యంత భద్రత గల రాష్ట్రమని, రాష్ట్ర రాజధానిలో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ తెలంగాణకు మరో మణిహారం అని, ప్రపంచ స్థాయి ప్రముఖ అద్భుత కట్టడాల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుందన్నారు.ముఖ్యమంత్రి కేసీఅర్ నాయకత్వములో రాష్ట్రంలో పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టడం వల్లే నేడు రాష్ట్ర భద్రత అద్భుతంగా ఉందన్నారు.

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, సుడా చైర్మన్ విజయ్ కుమార్, DCCB చైర్మన్ కురాకుల నాగభూషణం, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, అదనపు డీసీపీ సుభాష్ చంద్ర బోస్, ACP లు రామోజీ రమేష్, PV గణేష్, CI లు స్వామి, శ్రీధర్, సత్యనారాయణ, అంజలి, శ్రీనివాస్, అశోక్, చిట్టిబాబు, MTO శ్రీనివాస్, అడ్మిన్ RI రవి, RI తిరుపతి, సింహాచలం సాంబశివ రావు, si లు సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement