Thursday, April 25, 2024

దేశం కోసం మహోద్యమం….

ఖమ్మం, హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వనరులన్నీ సద్వినియోగం చేసుకుని, దేశాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పనిచేస్తోందని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతీయ పార్టీలు, అనేక మంది నాయకులు తమతో కలిసివస్తున్నారని, అంతిమ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఖమ్మం వేదికగా జరిగిన ‘జాతీయ శంఖా రావం’ భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ దేశ భవితవ్యాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోపే వెలుగు, జిలుగుల భారత్‌గా తీర్చి దిద్దుతామని పేర్కొన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ‘రైతుబంధు’ పథకాన్ని అమలుచేసి భేష్‌ అనిపించుకుంటా మని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రోల్‌ మోడల్‌గా వ్యవసాయ రంగానికి 24 గంటలపాటు పూర్తి ఉచితంగా విద్యు త్‌ను అందిస్తామని, ఆ ప్రణాళిక తమవద్ద ఉందని ప్రకటించారు. కష్టపడి పనిచేసే జాతి రత్నాలు.. మన రైతులు ఉండగా, ఎలాంటి కొదవ లేకుండా సంపద సృష్టించ వచ్చునని తెలిపారు. మూర్ఖులు, అసమర్థులు, మత సామరస్యాన్ని దెబ్బ తీసి రాజకీయ ప్రయోజనం పొందాలను కునే పార్టీని 2024 తర్వాత ఇంటికి పంపిస్తామ న్నారు. దేశ ఉజ్వల భవిష్యత్తుకు అవసరమయ్యే ప్రణాళికలను రచించి, వాటి అమలు లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ఢిల్లిdకి చేరుకుంటుందని ఆయన తేల్చి చెప్పారు. దేశ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందే బీఆర్‌ఎస్‌ పార్టీ అని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.


తెలంగాణ మోడల్‌ పథకాలను దేశమంతా అమలు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరించిన ప్రభుత్వరంగ సంస్థలను వాపసు తీసుకుంటామన్నారు. ఎల్‌ఐసీ కోసం బీఆర్‌ఎస్‌ పోరాడుతుందని ప్రకటిస్తూ, ఆ సంస్థ ఉద్యోగులు, ఏజెంట్లు కదం తొక్కాలని పిలుపునిచ్చారు. విద్యుత్‌ వ్యవస్థలను ప్ర భుత్వ రంగంలోనే ఉంచుతామని, అవసరం ఉన్నచోట వ్యాపారం చేయడం తమ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. నష్టాలు సమాజానికి, లాభాలు ప్రైవేటు- వ్యక్తులకా..? అని అని కేంద్ర ప్రభు త్వాన్ని ప్రశ్నించారు. ఎల్‌ఐసీని అడ్డికి పావుసేరుకు అమ్ముతారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కరెంటు- కార్మికులారా.. పిడికిలి బిగించండి’ అంటే వారిలో ఉద్యమ స్పూర్తిని నింపారు. ఇంకా దేశంలో లక్ష కోట్ల మెగావాట్ల జల విద్యుత్‌కు అవకాశం ఉందన్నారు. దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేసీఆర్‌ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. మీకు చేతకాకపోతే మేం అధికారంలోకి వచ్చాక ఇచ్చి తీరుతామని ప్రకటించారు. విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు-పరం కానివ్వమని ధ్వజమెత్తారు. ఈ పరిశ్రమను మోడీ ప్రభుత్వం అమ్మితె, తాము అధికారంలోకి వచ్చాక మళ్ళీ కొంటామని అన్నారు. లొడలొడ మాట్లాడే ప్రధానికి మంచి నీళ్లు ఇవ్వడం చేతకాదా.. అని విమర్శించారు. మేక్‌ ఇన్‌ ఇండియా.. జోక్‌ ఇన్‌ ఇండియాగా మారిందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. కొద్దిరోజుల్లోనే బీఆర్‌ఎస్‌ విధానాలు ప్రజల ముందుంచుతామని తెలిపారు. పదవీ విరమణ పొందిన ఐఏఎస్‌ అధికారులు, న్యాయమూర్తులు కలిపి మొత్తం 150 మంది మేధావులు బీఆర్‌ఎస్‌ పార్టీ విధివిధానాలు, లక్ష్యాలు రూపొందిస్తున్నారని కేసీఆర్‌ పేర్కొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్‌లపై తీవ్ర విమర్శలు
బీజేపీ, కాంగ్రెస్‌లపై సీఎం కేసీఆర్‌ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. దేశ దుస్థితికి కాంగ్రెస్‌, బీజేపీనే కారణమని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే బీజేపీని తిడుతుం దని, బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ విధానాలను తప్పుపడు తుందని ధ్వజమెత్తారు. దేశంలో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందే బీఆర్‌ఎస్‌ అని ఖమ్మం సభలో ప్రకటించారు. భారత్‌ అన్ని విధాలా సుసంపన్నమైన దేశం అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. జలవనరులు, సాగు భూమి విషయంలో మన దేశమే అగ్రగామిగా ఉందని తెలిపారు. కానీ కెనడా నుంచి కందిపప్పు దిగుమతి సిగ్గుచేటు- కాదా అని ప్రశ్నించారు. దేశంలో 70 వేల టీ-ఎంసీలు అందుబాటు-లో ఉన్నాయని చెప్పారు. కేవలం 20 వేల టీ-ఎంసీలు మాత్రమే వాడుకుంటు-న్నామని అన్నారు. దేశానికి నిర్దిష్ట లక్ష్యం లేకుండా పోయిందని విమర్శించారు. జింబాబ్వేలో 6 వేల టీ-ఎంసీల సామర్థం గల రిజర్వాయర్‌ ఉందని కేసీఆర్‌ అన్నారు. చైనాలో 5 వేల టీ-ఎంసీల సామర్థం గల రిజర్వాయర్‌ ఉందని పేర్కొన్నారు. కానీ దేశంలో అతిపెద్దదైన ఒక్క రిజర్వాయర్‌ ఉందా అని కేసీఆర్‌ ప్రశ్నించారు. దేశంలో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందే బీఆర్‌ఎస్‌ అని స్పష్టం చేశారు. బకెట్‌ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాచాలా అని ప్రశ్నించారు. రాష్ట్రాల్ర మధ్య నీటి యుద్ధాల అవసరం ఎందుకు వచ్చిందని కేసీఆర్‌ నిలదీశారు.
ఖమ్మం ప్రజలకు నిధుల వరద
ఖమ్మం సభలో జిల్లా వాసులకు సీఎం కేసీఆర్‌ వరాలు ప్రకటిం చారు. జిల్లాలోని మొత్తం 589 గ్రామ పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున, జిల్లాలోని మున్సిపాలిటీ-లకు రూ.30కోట్ల చొప్పున, ఖమ్మం మున్సిపాలిటికీ రూ.50కోట్లు- మంజూరు చేస్తున్నామని తెలిపారు. 10వేల జనాభా దాటిన మేజర్‌ పంచాయతీలకు రూ.10కోట్ల నిధులు కేటాయిస్తున్నాన్నారు. స్థానిక మంత్రి విజ్ఞప్తి మేరకు మున్నేరు నదిపై వంతెన మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో నెలలోగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ స్థలం దొరక్కపోతే సేకరించైనా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆర్థిక మంత్రిని కోరుతున్నా.. అని సీఎం తెలిపారు. ప్రజల డిమాండ్‌ మేరకు ఖమ్మం జిల్లాకు ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement