Wednesday, April 24, 2024

సత్తుపల్లిలో స్వతంత్ర వజ్రోత్సవాలు

జై జవాన్.. జై కిసాన్… భారత్ మాతాకీ జై… వందేమాతరం… నినాదాలతో సత్తుపల్లి పట్టణం మారుమోగిపోయింది. జాతీయ పతాకాన్ని పట్టుకొని 75 బుల్లెట్ మోటర్ సైకిళ్ళు, కిలోమీటర్ పొడవున జాతీయ జెండా, వేలాదిమంది విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థలు, కోలాటాలు, కొమ్ము డాన్సులు విద్యార్థులచే జాతీయ నాయకుల వేషధారణల నడుమ శనివారం సత్తుపల్లి పట్టణంలో స్వతంత్ర వజ్రోత్సవాల భారీ ర్యాలీ కొనసాగింది. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సత్తుపల్లి జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణ నుంచి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు. ప్రారంభం కార్యక్రమంలో సండ్ర మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు 15 రోజులపాటు జరిగే వజ్రోత్సవ వేడుకలు నిర్వ‌హించ‌డం జ‌రిగుతుంద‌న్నారు. సత్తుపల్లి పురపాలక సంఘం, పట్టణ ప్రజల విద్యాసంస్థలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది సహకారంతో వజ్రోత్సవ వేడుకల ర్యాలీ నిర్వహించామ‌న్నారు. అనంతరం డిగ్రీ కళాశాల నుంచి ప్రధాన రహదారి మీదుగా అంబేద్కర్ సెంటర్ సుభాష్ చంద్రబోస్ రింగ్ సెంటర్ మీదుగా కాకర్లపల్లి రింగ్ సెంటర్ వరకు అక్కడ నుంచి తిరిగి ర్యాలీతో సుభాష్ చంద్రబోస్ రింగ్ సెంటర్ వద్ద వరకు ర్యాలీ కొనసాగింది. సత్తుపల్లి పట్టణ ప్రజలు జాతీయ భావంతో ప్రధాని రహదారి మీదకు చేరుకొని ఇరువైపులా జాతీయ జెండాలు పట్టుకుని దేశ భక్తిని చాటారు. ర్యాలీలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో వాటర్ బాటిల్స్ సరఫరా చేయగా పలుచోట్ల స్వచ్ఛందంగా విద్యార్థులకు వాటర్ ప్యాకెట్లను అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement