Wednesday, December 4, 2024

TG: వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోండి… క‌లెక్ట‌ర్ కు రేగా లేఖ

వరద బాధితులను ఆదుకోవాలని భ‌ద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కలెక్టర్ కు లేఖ రాశారు. భద్రాద్రి జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం… మణుగూరు మున్సిపాలిటీలో గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు మణుగూరు టౌన్ మొత్తం ముంపునకు గురైంది… మీరు సందర్శించినప్పుడు కళ్ళారా ప్రజల ఇబ్బందులు చూసినారు అనుకుంటున్నాను.. ఇక వరద తగ్గిన తరువాత ముంపు బాధితులకు తినడానికి తిండిలేక ఇబ్బంది పడుతున్నారు. కట్టుబట్టలతో బయటకు వచ్చారు తప్ప.. నిత్యావసర సరుకుల్నీ తడిసి ముద్దయినాయి …

కనీసం వారికి సహాయం చేయలేదు ప్రభుత్వం… ఇప్పుడు ప్రస్తుతం చెత్తా చెదారం రోడ్లపైన పేరుకు పోయి దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు… మంచినీటి బావులు మురుగునీటితో నిండినాయి.. కనీసం బ్లీచింగ్ వేసే పరిస్థితి లేదు.. ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు.. నిన్నటి నుండి తమరికి పోన్ చేస్తున్నాను.. ప్రజల ఇబ్బందులు జిల్లా కలెక్టర్ గా మీ దృష్టికి తెస్తే స్పందించి చర్యలు తీసుకుంటారని ప్రయత్నం చేశాను.. మీరుకూడా స్పందించకపోవడం బాధాకరం.. జిల్లా ప్రజలకు ఎవరు దిక్కు.. మున్సిపల్ అధికారులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు.. అయినా తమరు స్పందించి తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని రేగా కాంతారావు కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement