Tuesday, April 23, 2024

భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం.. నీటమునిగిన సీతమ్మ విగ్రహం

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎస్సారెస్సీ ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ఉప్పొంగుతోంది. గురువారం ఉదయం నుంచి భద్రాచలం వద్ద భారీగా నీటిమట్టం పెరుగుతోంది. ఈ క్రమంలో పర్ణశాలలో స్వామివారి నార చీరల ప్రాంతం పూర్తిగా నీటమునిగింది. అటు, సీతమ్మ వారి విగ్రహం, స్వామివారి సింహాసనం కూడా మునిగిపోయాయి.

ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.

ఈ వార్త కూడా చదవండి: తాలిపేరు ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తివేత

Advertisement

తాజా వార్తలు

Advertisement