Monday, September 20, 2021

డిగ్రీ లేదని నిశ్చితార్థంలోనే యువకుడిని ఛీ కొట్టిన యువతి

ఖమ్మం జిల్లా వైరాలో విచిత్రం చోటుచేసుకుంది. కాబోయే భర్త డిగ్రీ మధ్యలోనే ఆపేయడంతో ఓ యువతి అతడితో పెళ్లికి నిరాకరించింది. వైరా మండలం మల్లాపురం గ్రామానికి చెందిన బీటెక్ చదివిన అమ్మాయికి ఈర్లపూడిలోని భాగ్య తండాకు చెందిన ఇక్బాల్ అనే వ్యక్తితో పెళ్లి కుదిరింది. ఈ నేపథ్యంలో ఆదివారం యువతి ఇంటివద్ద నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. అయితే పెళ్లి చూపుల సమయంలో యువకుడు తాను డిగ్రీ పూర్తి చేశానని యువతి కుటుంబ సభ్యులకు చెప్పాడు.

కానీ నిశ్చితార్థం సమయంలో అతడు డిగ్రీ పాస్ అవ్వలేదని మధ్యలోనే ఆపేశాడని యువతికి తెలిసింది. దాంతో ఆ యువతి వెంటనే తనను మోసం చేశాడంటూ నిశ్చితార్థం రద్దు చేసుకుంది. ఈ సందర్బంగా యువకుడికి యువతి కుటుంబ సభ్యులకు మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో యువతి తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News