Thursday, April 25, 2024

ఖ‌మ్మం కార్పొరేష‌న్ – 13వ డివిజిన్ టిఆర్ ఎస్ కైవసం..

ఖ‌మ్మం : ఖ‌మ్మం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల బ్యాలెట్స్ లెక్కింపు నేటి ఉద‌యం ప్రారంభమైంది… ముందుగా పోస్ట‌ల్ బ్యాలెట్స్ ను లెక్కిస్తున్నారు.. . ఎస్‌ఆర్‌ అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాలలో మొత్తం 59 డివిజ‌న్ ల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు… ఇక్క‌డ మొత్తం 60 డివిజ‌న్ ఉండ‌గా 10వ డివిజ‌న్ ను టిఆర్ ఎస్ ఏక‌గ్రీవంగా కైవ‌సం చేసుకుంది…కాగా, 13వ డివిజన్ లో టి ఆర్ ఎస్ అభ్యర్ధి కొత్తపల్లి నీరజ గెలుపొందారు. ఇది ఇలా ఉంటే లెక్కింపు కోసం ప్రతి డివిజన్‌కు ఓ కౌంటింగ్ అధికారిని నియమించారు. 59 మంది ఆర్వోలు, ప్రతి టేబుల్‌కు ఓ సూపర్ వైజర్‌ను నియమించారు. ఓట్ల లెక్కింపు కోసం 10 హాళ్లు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement