Thursday, April 25, 2024

Breaking: లిఫ్ట్ ఇచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు

ఏదో మానవత్వంతో లిఫ్ట్ ఇస్తే.. లిఫ్ట్ అడిగిన వ్యక్తి రాక్షసుడిలాగా వ్యవహరించి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి ప్రాణాన్నే బలితీసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి టూవీలర్ లిఫ్ట్ అడిగాడు. లిఫ్ట్ ఇచ్చిన యువకుడిని దుండగుడు సూదితో పొడిచాడు. సూది పొడిచిన వెంటనే బైక్ నడుపుతున్న యువకుడు చనిపోయాడు. దీంతో సూదితో పొడిచిన ఆగంతకుడు టూ వీలర్ తో పరారయ్యాడు. ముదిగొండ మండలం బాణాపురంలో ఈ ఘటన జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement