Saturday, November 9, 2024

TG | 40 క్వింటాల్ల రేషన్ బియ్యం పట్టివేత…

పాల్వంచ,(ప్రభ న్యూస్): ఖమ్మం నుంచి బూర్గంపాడు మండలం లక్ష్మీపురంకు తరలిస్తున్న 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పాల్వంచ రూరల్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. సోములగూడెం క్రాస్ రోడ్డు వీరనాయక్ తండా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలో ఖమ్మం వైపు నుంచి అనుమానాస్పదంగా వెళ్తున్న వాహనాన్ని గమనించి తనిఖీ చేయగా అందులో 80 బస్తాల రేషన్ బియ్యం లభ్యమయ్యాయి. దీంతో 80 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం అగ్రహారానికి చెందిన మొగిలి అశోక్ బియ్యం సరఫరా చేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు.

బూర్గంపాడు మండలం లక్ష్మీపురానికి చెందిన సతీష్ రైస్ మిల్లుకు ఆ బియ్యం తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ దుగ్గిరాల హరీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ రాములు, సిబ్బంది తేజావత్ నాగేశ్వరరావు, ప్రసాదరావు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement