Tuesday, November 28, 2023

Khammam – తెలుగువారందరికీ ఎన్టీఆర్ ఆరాధ్య దైవం – కెటిఆర్

ఖ‌మ్మం – పంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని, రాముడైనా ఆయనే.. కృష్ణుడైనా ఆయనేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఖ‌మ్మంలోని ల‌కారం ట్యాంక్‌బండ్‌పై రూ. 1.37 కోట్ల‌తో నూత‌నంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్కు స‌హా విగ్ర‌హాన్ని మంత్రి పువ్వాడ అజ‌య్‌తో క‌లిసి కేటీఆర్ ఆవిష్క‌రించారు . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు తన నటనతో, నాయకత్వ పటిమతో ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. తెలుగువారికి ప్రపంచ గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఆయనేనని చెప్పారు. అందుకే ప్రస్తుతం ప్రపంచంలో ఏమూలన నివసిస్తున్నా సరే తెలుగు వారందరికీ ఆరాధ్య దైవమయ్యాడని అన్నారు. రాముడిని, కృష్ణుడిని జనం ఆయనలోనే చూసుకుంటారని తెలిపారు. అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించగలగడం తన అదృష్టమని మంత్రి కేటీఆర్ చెప్పారు. తారక రామారావు పేరులోనే పవర్ ఉందని, తనకూ ఆ పేరు ఉండడం సంతోషంగా ఉందని వివరించారు.

- Advertisement -
   

ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారని, తెలంగాణ అస్తిత్వాన్ని దేశం నలుమూలలా చాటారని వివరించారు. ఎన్టీఆర్ సహా దక్షిణ భారత దేశంలో ముఖ్యమంత్రి పదవిని మూడుసార్లు ఎవరూ అధిష్టించలేదని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. అయితే, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మరోమారు అధికారంలోకి తెచ్చి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి సీటులో కూర్చుంటారని కేటీఆర్ తెలిపారు

ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సంబంధించిన పథకాలను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్నది. ఈమేరకు అన్ని మున్సిపాలిటీల్లో వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లను అన్ని హంగులతో, ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేప‌థ్యంలో ఖమ్మం నగరంలోని వీడీఓస్‌ కాలనీలో సకల సౌకర్యాలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్‌ & నాన్‌వెజ్‌ మార్కెట్ ను మంత్రులు కెటిఆర్ ,పువ్వాడ‌లు ప్రారంభించారు.

అంతుకు ముందు లకారం ట్యాంక్ బండ్ వద్ద చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఇక రామచంద్రయ్య నగర్‌లో పట్టణ ప్రగతి నిధులతో నిర్మించిన కేఎంసీ స్పోర్ట్స్‌ పార్క్‌ను , ప్రకాష్ నగర్ లో నిర్మించిన ప్రొఫెసర్ జయశంకర్ పార్క్‌ను కూడా ప్రారంభించారు. అలాగే ఖమ్మం నగరం గుండా ప్రవహించే మున్నేరు నదికి రెండు వైపులా నిర్మించే రక్షణ గోడలు, నదిపై నిర్మించే హై లెవెల్ కేబుల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు.


కాగా, వ‌ర్షం కార‌ణంగా భ‌ద్రాచ‌లం ప‌ర్య‌ట‌నను వాయిదా వేసుకున్నారు కెటిఆర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement