Sunday, December 1, 2024

Tribute – ప్రజాకవి కాళోజీకి కెసిఆర్ ఘన నివాళి

ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. మహోన్నతమైన తెలంగాణ అస్తిత్వాన్ని, సాహిత్య సాంస్కృతిక గరిమను ప్రపంచానికి చాటేందుకు కవిగా తన కలాన్ని గళాన్ని మొత్తంగా తన జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించిన కాళోజీ కృషి చిరస్మరణీయమని కొనియాడారు.

తెలంగాణ సమాజం కోసం కాళోజీ పడిన తపన, వారందించిన పోరాట స్ఫూర్తి, మలిదశ ఉద్యమంలో అనంతర బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో ఇమిడివున్నదని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. కాళోజీ కృషి ని, స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించడానికి నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. తోటి మనిషి క్షేమాన్ని కోరుకోవడం, సబ్బండ వర్గాల అభ్యున్నతకి చిత్తశుద్ధితో కృషి చేయడం ద్వారానే వ్యక్తులుగా, ప్రభుత్వాలుగా కాళోజీ కి మనం అందించే ఘన నివాళి అని కేసీఆర్ అన్నారు.

ప్రజా గొంతుక.. ధిక్కార ప్రతీక కాళోజీ – కేటీఆర్‌

- Advertisement -

ప్రజా గొంతుక.. ధిక్కార ప్రతీక కాళోజీ అని కేటీఆర్‌ అన్నారు. అక్షరాన్ని ఆయుధంగా మలిచి, మాటల తూటాలతో ప్రజా ఉద్యమాలకు తన జీవితాన్ని ధారబోసిన యోధుడు మన కాళన్న అని కేటీఆర్‌ అన్నారు . కవిగా, రచయితగా సమాజంలోని అన్యాయాలకు, అణిచివేతలకు వ్యతిరేకంగా పోరాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకు పరితపించిన అక్షర తపస్వి కాళోజీ నారాయణ రావు అని కొనియాడారు. తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజీ జయంతిని (సెప్టెంబర్ 9) కేసీఆర్ గారు తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించారని గుర్తుచేశారు.. వైద్య విశ్వవిద్యాలయానికి వారి పేరు పెట్టారని అన్నారు. వరంగల్‌లో సుందరమైన కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారని చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా కాళోజీ అందించిన స్ఫూర్తి, చేసిన సేవలు సదా స్మరణీయమని అన్నారు.

“అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు” అంటూ సగర్వంగా చాటిన తెలంగాణ ప్రజాకవి కాళోజీ నారాయణ రావును హరీశ్‌రావు కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement