Saturday, April 20, 2024

కెసిఆర్ మాకు బలం.. కార్యకర్తలే మా బలగం.. మంత్రి గంగుల

సీఎం కెసిఆర్ మాకు బలం.. కార్యకర్తలే మా బలగం అని వి కన్వెన్షలో జరిగిన భారత రాష్ట్ర సమితి పార్టీ కరీంనగర్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బడుగు బలహీన వర్గాల పార్టీ BRS పార్టీ అన్నారు. భవిష్యత్ అంతా బిఆర్ ఎస్ దేన‌ని అన్నారు.పార్టీ కోసం ప్రతి కార్యకర్త కష్ట పడి పని చేయాలని, కెసిఆర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలదే అన్నారు.జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవరర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షులు జి వి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా ఇంచార్జి సారయ్య, ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీ లు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement