Thursday, March 28, 2024

ప్ర‌జ‌లు గొప్ప‌గా జీవించాల‌నేది కేసీఆర్ సంక‌ల్పం : మంత్రి త‌ల‌సాని

అన్ని వసతులు కలిగిన సొంత ఇంటిలో పేద ప్రజలు సంతోషంగా, గొప్పగా జీవించాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంకల్పమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధ‌వారం ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇందిరా నగర్ లో నిర్మించిన 211 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించేందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించే కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, MLA దానం నాగేందర్, కార్పొరేటర్ విజయా రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. అధికారులు లబ్ధిదారులను ఒక్కొక్క‌రిగా పిలిచి అర్హులను గుర్తించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… పేద ప్రజల కోసం ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను లబ్ధిదారుల సమక్షంలో అర్హులను గుర్తించి కేటాయిస్తూ పారదర్శకత పాటిస్తున్నట్లు చెప్పారు. పేద ప్రజలకు ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇస్తున్న కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా అమలులో లేదన్నారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి త్వరలోనే ఇండ్లను పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వసంత, తహసీల్దార్ అన్వర్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement