Thursday, April 25, 2024

మనిషి సామాజిక వ్యక్తిగా మారడం పుస్తక పఠనం నేర్పుతుంది – ఎమ్మెల్సీ కవిత

కరీంనగర్ – మనిషి సామాజిక వ్యక్తిగా మారడం పుస్తక పఠనం నేర్పుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కరీంనగర్ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ లకు కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ వద్ద మంత్రి గంగుల కమలాకర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని… కరీంనగర్ లోని జ్యోతి బాపూలే మైదానంలో నిర్వహిస్తున్న కరీంనగర్ పుస్తక మహోత్సవాన్ని ఎమ్మెల్సీ కవిత, మంత్రులు సత్యవతి రాథోడ్,గంగుల కమలాకర్ లు సందర్శించారు.

ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శనలోని స్టాళ్ళను పరిశీలించారు. అక్కడ ఉన్న మహిళలను… చిన్నారులను కలిసి కాసేపు ముచ్చటించారు. వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు పుస్తకాలను మంత్రి గంగులకు చూపిస్తూ… వీటిని చదువాలంటూ సూచించారు. ఏడు తరాల పుస్తకాన్ని చదివి తాను కన్నీటి పర్యంతమయ్యానని, మీరు కూడా తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవాలని కవిత మంత్రి గంగులకు పుస్తకాన్ని అందించారు. పలు పుస్తకాలను కొనుగోలు చేశారు. మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతీ ఏటా పుస్తక ప్రదర్శన నిర్వహించడం అభినందనీయం అని, నిర్వాహకులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యాస రచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన గురుకుల పాఠశాల చిన్నారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement