Friday, April 19, 2024

త్వ‌ర‌లో ప్ర‌జ‌ల‌ను కూడా బిజెపి టార్గెట్ చేస్తుంది – హెచ్చ‌రించిన క‌విత‌

కొత్త ఢిల్లీ – బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈడీ,సీబీఐ దాడులతో భయపెట్టాలని చూస్తోందని ఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్ర‌స్తుతం రాజకీయ పార్టీలకు కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందని కొంతకాలం పోతే ప్రజల్ని కూడా టార్గెట్ చేస్తుందని హెచ్చ‌రించారు.. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపాల్సిందేనని అప్పటి వరకు తమ పోరాటం కొనసాగుతుందని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయిందని విమర్శించిన కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. కాగా..ఢిల్లీలో మార్చి 10న పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఒక రోజు దీక్ష చేసిన కవిత ఆ మరునాడే ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈక్రమలో మరోసారి ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం రౌండ్ టేబుల్ సమావేశం నేటి సాయంత్రం నిర్వ‌హించ‌నున్నారు… రీ మెరిడియన్ హోటల్ లో జరుగనున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, పౌరసంఘాలు, మహిళా సంఘాల ప్రతినిథులు పాల్గొనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement