Thursday, April 25, 2024

మహిళల భరోసాకు ఉమెన్స్ హెల్ప్ డెస్క్ : సీపీ సత్యనారాయణ

మహిళకు భరోసా కల్పించేందుకు ఉమెన్స్ హెల్ప్ డెస్క్ మ‌రింత‌ దోహదపడుతుందని సీపీ వీ.సత్యనారాయణ తెలిపారు. మహిళలు, చిన్నారులు తమ సమస్యలను మరింత స్వేచ్ఛ‌గా పోలీస్ స్టేషన్లకు చేరుకోగలిగేలా చేయడంపై దృష్టి పెట్టిన పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, రిసెప్షనిస్ట్లులకు ఉమెన్ హెల్ప్ డెస్క్ విధులపై రెండు రోజుల శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ప్రారంభించారు. పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ.. బాధిత మహిళలను గౌరవంగా సంబోధించే వాతావరణం కల్పిస్తూ.. తమ సమస్యను నిర్భయంగా చెప్పుకునేలా, న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలని అన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లల భద్రతకు తెలంగాణ పోలీస్ శాఖ ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని పోలీసులంటే అపోహలు పోగొట్టి ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో మహిళ సిబ్బందితో కూడిన మహిళా హెల్ప్‌ డెస్క్‌ల ద్వారా బాధిత మహిళల పట్ల సున్నితంగా ఉండటానికి, స్నేహపూర్వకంగా ఎలా వ్యవహరించాలో సిబ్బందికి శిక్షణలో నిర్దేశించామని తెలిపారు. శిక్షణ తరగతులను సిరియస్ గా తీసుకొని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో కరీంనగర్ అడిషనల్ డీసీపీ (అడ్మిన్) జి చంద్ర మోహన్, సిరిసిల్ల అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఎస్పీ వినోద్ కుమార్, ఇన్ స్పెక్ట‌ర్ శ్రీనివాస్, SB ఇన్ స్పెక్ట‌ర్ వెంకటేశ్వర్లు, సీటీసీ ఇన్ స్పెక్ట‌ర్ వీ.మాధవి, డ‌బ్ల్యూపీఎస్ ఇన్ స్పెక్ట‌ర్ శ్రీనివాస్, ఉమ్మడి జిల్లాల అన్ని పోలీస్ స్టేషన్స్ ఎస్ హెచ్ వో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement