Sunday, December 4, 2022

ట్రేడ్ లైసెన్స్ ఫీజు తగ్గించేలా కృషి చేస్తా.. ఎమ్మెల్యేను సన్మానించిన వ్యాపారస్తులు

పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు తగ్గించేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హామీ ఇవ్వడంతో వర్తక వ్యాపారులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. పెంచిన ట్రేడ్ లైసెన్స్ భారంగా ఉందని వ్యాపార వర్గాలు ఎమ్మెల్యేకు విన్నవించడంతో సానుకూలంగా స్పందించిన ఆయన ప్రభుత్వ ఉత్తర్వులు 147 ప్రకారం ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలు చేసేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని వ్యాపారస్తులు బాలకిషన్ జాకోటియా, మోయిద్, మస్రత్, విశ్వనాథ్, బత్తుల రమేష్, రవి, ప్రసాద్, అమర్ లింగం, ప్రకాష్, రమేష్, తబ్రేజ్ లు ఎమ్మెల్యే కు శాలువా వేసి సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement