Thursday, April 25, 2024

మోడల్ పోలీస్ స్టేషన్లను నిర్మిస్తున్నాం.. హోంమంత్రి మహమూద్ అలీ

రాష్ట్రంలో మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణం వేగంగా జరుగుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహామూద్ అలీ పేర్కొన్నారు. మంగళవారం పెద్దపెల్లి జిల్లాలోని అంతర్గాం, గోదావరిఖని ఒకటవ పోలీస్ స్టేషన్ తో పాటు పోలీస్ అతిథి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… తెలంగాణ ఆవిర్భావ మంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అని, మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణంతో పాటు పోలీసులకు అత్యాధునిక సౌకర్యాలు వాహనాలు అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తోపాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement