Thursday, April 25, 2024

తాగునీటి సమస్య..

వేములవాడ: ఓ వైపు వేసవికాలం కావడంతో ప్రజల గొంతు ఎండుతుంటే మరో వైపు మరమ్మతులు చేయడాన్ని బట్టి చూస్తే ప్రజా సమస్యలపై పాలకులకు ఏపాటి శ్రద్ధ ఉందో అర్ధమవుతుందని కాంగ్రెస్‌ పార్టీ వేమువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌ మండిపడ్డారు. ఎదురుగట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆది మాట్లాడుతూ గత 10 రోజులుగా మిషన్‌ భగీరథ నీళ్లు బంద్‌ అయ్యాయని, మరో పది రోజులైనా నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. మరమ్మతుల పేరిట అధికారులు కాలయాపన చేయడంతో గుక్కెడు నీళ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. స్థానిక నాయకుడి ఆన్‌లైన్‌ పాలనతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. వెంటనే ప్రజలకు తాగు నీరందించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ముందు చూపు లేకనే తాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, గ్రామ పంచాయతీలకు ప్రత్యేక కరువు నిధులు అందించి తాగునీటి సమస్యలు తీర్చాలన్నారు. ఈకార్యక్రమంలో రూరల్‌ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్‌, ఎదురుగట్ల సర్పంచ్‌ సోమినేని కరుణాకర్‌, అడిగ శేఖర్‌, వార్డు సభ్యులు శేఖర్‌, గంగారెడ్డి, నాయకులు ప్రకాష్‌, నాగేందర్‌, రాజు, మల్లేశం, కిషోర్‌, అజయ్‌, ప్రశాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement