Saturday, April 20, 2024

నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు – నంబర్‌ ప్లేటు లేని వాహనాలపై కొరఢా..

పెద్దపల్లి : రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు- జరిమానాలు విధిస్తున్నామని పెద్దపల్లి ఎస్‌ఐ రాజేశ్‌ తెలిపారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప టె-ంపుల్‌ వద్ద ఎస్సై రాజేష్‌ ఆధ్వర్యంలో నెంబర్‌ ప్లేట్‌ సరిగా లేని వాహనాలపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కూడళ్లతోపాటు శివారులో వాహనాల తనిఖీలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాల, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వారిపై, ఇన్సూరెన్స్‌ లేని వారిపై, నెంబర్‌ ప్లేట్‌ నిబంధనల ప్రకారం లేని, వాహనాలపై కేసులు నమోదు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధ్రువీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్‌ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసే వారిపై, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వారికి లేని వారికి బండి ఇవ్వడం, మైనర్‌ పిల్లలకు వాహనాలు ఇవ్వడం, నెంబర్‌ ప్లేట్‌ లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడంలాంటి వాహనాలపై కేసులు నమోదు చేస్తామన్నారు. అలాగే న్యూ ఇయర్‌ సందర్భంగా స్పెషల్‌ డ్రైవర్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో ఎస్సైలు మౌనిక, సహదేవ్‌ సింగ్‌ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement