Saturday, April 20, 2024

గులాబీ జెండా రెపరెపలు.. వాడ వాడలో సంబరాలు

పెద్దపల్లి నియోజకవర్గంలో గులాబీ జెండా రెపరెపలాడుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల్లోని వాడ వాడ లో గులాబీ శ్రేణులు జెండా ఆవిష్కరించి మిఠాయిలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో అన్ని గ్రామాల్లో తెరాస నాయకులు గులాబీ జెండా ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement