Thursday, September 23, 2021

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్.. ఆందోళనలో కార్యకర్తలు

టీఆర్ఎస్ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి రెండో సారి కరోనా బారిన పడ్డారు. మంగళవారం స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్న ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే హైదరాబాద్ యశోదా ఆస్పత్రి వైద్యులను సంప్రదించి చికిత్స పొందుతున్నారు.

కాగా గత నెలరోజులుగా హుజురాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా వీణవంక మండలంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రచారం సమయంలోనే ఎమ్మెల్యేకు కరోనా సోకి ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తనతో పాటు ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులు కరోనా పరీక్ష చేయించుకోవాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News