Thursday, April 25, 2024

ఘనంగా తెరాస ఆవిర్భావ వేడుకలు

పెద్దపల్లిరూరల్‌: మండలంలో తెరాస ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం మండలంలోని గౌరెడ్డిపేట గ్రామంలో తెరాస ఆవిర్భావం సందర్భంగా ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్‌ గౌడ్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం కోసమే తెరాసను స్థాపించి ప్రజల కలను నెరవేర్చారని గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు ఉత్తమ్‌, ప్రదీప్‌, పోసాని సతీష్‌, సాగర్‌, సంతోష్‌, శరత్‌, విమల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement