Monday, January 30, 2023

13మంది తహసీల్దార్ల బదిలీ.. ఏ జిల్లాలో అంటే..

పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న 13 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
ముత్తారం తాసిల్దార్ గా పనిచేస్తున్న సుధాకర్ ను పెద్దపెల్లి తాసిల్దార్ గా, పెద్దపల్లి తాసిల్దార్ గా పని చేస్తున్న శ్రీనివాస్ ను కలెక్టరేట్కు, కలెక్టరేట్ లో పనిచేస్తున్న నారాయణను ఒదేలకు, ఓదెల లో పనిచేస్తున్న రామ్మోహన్ రామగిరికి, రామగిరి తాసిల్దార్ గా పని చేస్తున్న పుష్పలత ను పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయానికి, పెద్దపల్లి ఆర్ డి ఓ కార్యాలయంలో పనిచేస్తున్న నాగరాజమ్మ ను ఎలిగేడుకు, ఎలిగేడు లో పనిచేస్తున్న పద్మావతిని ముత్తారం కు, మంథని ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న రాజమని కలెక్టరేట్కు, కలెక్టరేట్ లో పనిచేస్తున్న జయ శ్రీని మంథని ఆర్డీవో కార్యాలయానికి, కలెక్టరేట్ లో పనిచేస్తున్న అనుపమ ను కాల్వశ్రీరాంపూర్ తాసిల్దార్ గా, శ్రీరాంపూర్ తాసిల్దార్ గా పనిచేస్తున్న సునీతను కలెక్టరేట్కు, జూలపల్లి తాసిల్దార్ గా పనిచేస్తున్న వేణుగోపాల్ ను అంతర్గం కు, జూలపల్లి లో నాయక్ తాసిల్దార్ గా పని చేస్తున్న అబు బాకర్ ను జూలపల్లి తాసిల్దార్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement