Wednesday, April 14, 2021

ట్రాఫిక్‌ పోలీస్‌ మానవత్వం..

గోదావరిఖని: ఎండలో రోడ్డు దాటాడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలి పట్ల ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మానవత్వాన్ని ప్రదర్శించాడు. గోదావరిఖనిలోని మున్సిపల్‌ టీ జంక్షన్‌ వద్ద ఎండలో రోడ్డు దాటాడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలిని అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ రామూర్తి గమనించారు. వెంటనే స్పందించి ఆ అవ్వని తానే స్వయంగా రోడ్డు దాటించిన కానిస్టేబుల్‌ ఎక్కడకి వెళ్లాలో కూడా తెలుసుకున్నాడు. ఆమె ప్రభుత్వ హాస్పిటల్‌కి వెళ్లాలని చెప్పడంతో తానే ఆటోలో ఎక్కించి పంపించాడు. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మానవీయతను పలువురు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News