Wednesday, April 24, 2024

దస్తగిరిపల్లిలో పులి సంచారం..

పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి మండలం పెడ్డబొంకూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దస్తగిరిపల్లిలో పులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం పంట చేన్లలో పులి తిరిగినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఫారెస్ట్ సెక్షన్ అధికారి మంగీలాల్ పంట చేన్లలో పులి కాలి పాద ముద్రలను పరిశీలించారు. పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే పంట పొలాలు, చేన్లకు వెళ్ళే వారు అప్రమత్తంగా ఉండాలని, గుంపులు గుంపులుగానే వెళ్లాలని ఫారెస్ట్ అధికారి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement