Tuesday, April 23, 2024

ఇంటిపై ఒరిగిన గ్రానైట్ రాయి.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

పెద్దపల్లి : లారీలో తరలిస్తున్న గ్రానైట్ రాయి అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఇంటిపై పడింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం కేంద్రంలో సోమవారం లారీలో తరలిస్తున్న గ్రానైట్ రాయి అదుపుతప్పి దక్షిణామూర్తి అనే వ్యక్తికి చెందిన ఇంటి ప్రహారీ గోడ‌ పై పడింది. గ్రానైట్ రాయి పడడంతో ప్రహరీ గోడ దెబ్బతినడం తోపాటు ఇంటికి పగుళ్లు ఏర్పడ్డాయి. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రాణ నష్టం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement