Tuesday, April 23, 2024

తెలంగాణ వీర శివాజీ సర్వాయి పాపన్న – పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి : తెలంగాణ వీర శివాజీ సర్ధార్‌ సర్వాయి పాపన్న అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలొ ని కలెక్టరేట్‌లో బహుజన పోరాట యోధుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణలు పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ గోల్కొండ కోటపై తెలంగాణ జెండా ఎగురవేసిన మొట్టమొదటి ధీరుడుగా సర్వాయి పాపన్న చరిత్రలో నిలిచిపోయారన్నారు. మొగల్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన పోరాట యోధుడని, తెలంగాణ వీర శివాజీగా సర్దార్‌ సర్వాయి పాపన్న ధైర్య సాహసాలు ప్రదర్శించారని గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్‌, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, జిల్లా ప్రభుత్వ అధికారులు, గౌడ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement