Saturday, December 10, 2022

అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోన్న తెలంగాణ : మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌

అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ దూసుకుపోతుంద‌ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. పెద్దపల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో గ్రామీణ పరిస్థితులు పూర్తిస్థాయిలో మార్చేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ప్ర‌త్యేక తెలంగాణ ఏర్ప‌డ్డాక అనేక మార్పులు జ‌రిగాయ‌ని, అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్నామ‌న్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి రైతుల‌కు మేలు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇప్పుడు పంట‌ల‌కు పుష్క‌లంగా నీరు అందుతుంద‌న్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఉచిత కరెంట్‌ను అందిస్తున్నారు. పండిన పంటలను కొనుగోలు చేస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా విరివిగా పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం ఎక్కడా లేదని ఒక్క తెలంగాణలో మాత్రమే అత్యధిక పెన్షన్లు ఇస్తున్నారని వివరించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement