Thursday, December 5, 2024

KNR | ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు.. సైకాలజిస్ట్ పున్నం చందర్

సిరిసిల్ల, నవంబర్ 15 (ప్రభ న్యూస్) : ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని సైకాలజిస్ట్ పున్నం చందర్ అన్నారు. గురువారం సిరిసిల్ల పట్టణంలోని గణేష్ నగర్ లో మనోవికాస కేంద్రం ఆధ్వర్యంలో మనోధైర్య సదస్సు నిర్వహించారు. కార్మికులను ఉద్దేశించి సైకాలజిస్ట్ డాక్టర్ పున్నం చందర్ మాట్లాడుతూ… కార్మికులు మనోధర్యంతో సమస్యలను అధిగమించి ప్రయత్నం చేయాలన్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని కార్మికులకు నిరంతరం పని కల్పించే ప్రయత్నం చేస్తుందని తెలిపారు.

సమస్యల పట్ల అతిగా ఆలోచించినప్పుడే ఆత్మహత్య లాంటి ప్రమాదకర ఆలోచనలు వస్తాయని అన్నారు. మనోధైర్యంతో సమస్యలను అధిగమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 21వ వార్డు కౌన్సిలర్ వేముల శ్రీనివాస్, మనోవికాస కేంద్రం సిబ్బంది వేముల అన్నపూర్ణ, బూర శ్రీమతి, కొండ ఉమా, రాపల్లి లత, పలువురు కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement