Friday, April 26, 2024

పత్తిపాక జలాశయం ఏర్పాటుకు అడుగులు : కొప్పుల

ధర్మారం, (ప్రభన్యూస్‌): ధర్మారం మండలం పత్తిపాకలో జలాశయం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. జలాశయం ఏర్పాటు కోసం తయారు చేసిన ప్రతిపాదనలు వెంటనే ప్రభుత్వానికి పంపించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. పత్తిపాక జలాశయం (1 టీఎంసీ) ఏర్పాటుపై గురువారం మంత్రి కొప్పుల ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి జలాశయ ఏర్పాటుకు తయారు చేసిన ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. రిజర్వాయర్‌ ఏర్పాటులో భాగంగా రామడుగు మండలం రామచంద్రాపురం గ్రామం వరద కాలువపై నిర్మించిన మోతె కాలువ ఓటీ1 ద్వారా పెద్ద కురమపల్లి గ్రామం వద్ద గల ఎస్సారెస్పీ కాలువకు, పత్తిపాక గ్రామానికి మధ్య గల ఆయకట్టుకు సాగు అందించడంతోపాటు ధర్మారం మండలంలోని 30 చెరువులు, ప్రతిపాదిత జలాశయంను నింపనున్నట్లు తెలిపారు.

అలాగే ప్రతిపాదిత జలాశయం ఎగువన 3వేల ఎకరాలకు, దిగువన బొమ్మారెడ్డిపల్లి, కొత్తపల్లి, పత్తిపాక, ధర్మారం గ్రామాల పరిధిలోని 7వేల ఎకరాలకు సాగు నీరందించే వీలుంటుందన్నారు. జలాశయ సామర్థ్యం 1 టీఎంసీ కాగా, మొత్తం ఆయకట్టు 10వేల ఎకరాలకు రూ. 103 కోట్లు, రేవెల్లి నుంచి జలాశయం వరకు కాలువ 7.1 కి.మీ 3వేల ఎకరాల ఆయకట్టుకు రూ. 37.50 కోట్లు, పత్తిపాక జలాశయం దిగువన కాలువలు 15 కి.మీ 7వేల ఎకరాల ఆయకట్టుకుగాను రూ. 89.50 కోట్ల అంచనాతో మొత్తం రూ. 230.00 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement