Friday, June 2, 2023

ఈటలకు నూకలు చెల్లాయి : గెల్లు శ్రీనివాస్ యాదవ్

మంత్రిని చేసిన సీఎం కేసీఆర్‌ను ఓడిస్తా అనడానికి నీకు నోరెలా వచ్చింది ఈటల అని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్‌కు ఈటల, తెలంగాణకు సంజ‌య్ చేసింది ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. హుజురాబాద్‌లో ఈటలకి నూకలు చెల్లాయని అన్నారు. నేను గెలిస్తే హుజురాబాద్‌కు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేవాడిని.. దమ్ముంటే ఈటల నువ్ హుజురాబాద్ మెడికల్ కాలేజీ తీసుకురా.. హుజురాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే అని శ్రీనివాస్ యాదవ్ చెప్పుకొచ్చారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement