Saturday, June 19, 2021

విద్యార్థులకు సోలార్‌ లాంప్‌ల పంపిణీ

ఓదెల: మండల కేంద్రంలోని ఓదెల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 9, 10వ తరగతి విద్యార్థులకు సోలార్‌ లాంపుల పంపిణీ చేశారు. విద్యార్థులకు విద్యుత్‌ అంతరాయం కలిగే సమయంలో చదువుకోవడానికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో టాటా సోలార్‌ కంపెనీ వారు విద్యార్థులకు సబ్సిడీ ఇస్తుందన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల యాజమాన్య కమిటీ- చైర్మన్‌ ఇప్పనపల్లి వెంకటేష్‌ కోరారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. రామకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News