Friday, April 26, 2024

ఎకరాకు రూ.10వేలు.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరోసారి రైతు బాంధవుడని నిరూపించుకున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండల కేంద్రంలో వడగళ్ళ వానతో నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం అందిస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పంట నష్టంపై క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళిన సీఎం కేసీఆర్ రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఎకరానికి పదివేల రూపాయలు పునరావాస సాయం కింద అందిస్తామని ప్రకటించడమే కాకుండా 228 కోట్ల రూపాయలు మంజూరు చేయడం హర్షణీయమాన్నారు. రైతాంగాన్ని ఆదుకునేది కేవలం తమ ప్రభుత్వమేనని, బిజెపి, కాంగ్రెస్ లు పబ్బం గడుపుకునేందుకు అసత్యపు ప్రచారాలు మాత్రమే చేస్తాయని రైతాంగానికి ఎటువంటి సాయం చేయరన్నారు. నియోజకవర్గంలోని రైతాంగానికి సైతం పంట నష్టపరిహారం అందిస్తామని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement