Friday, December 6, 2024

KNR | చదవాలి.. రాయాలి.. నిత్యం సాధన చేయాలి… విద్యార్థుల‌తో క‌లెక్ట‌ర్

సిరిసిల్ల గీతా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఆహార పదార్థాల తయారీ, వంట గది తనిఖీ


సిరిసిల్ల, అక్టోబర్ -23 (ఆంధ్ర‌ప్ర‌భ‌ ) : విద్యార్థులు నిత్యం తమ పాఠ్యాంశాలను చదువుతూ, రాస్తూ సాధన చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం పరీక్ష కోసం విద్యార్థులు చదువుతుండగా, పలు అంశాలపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.

విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. ఈరోజు మెనూ ప్రకారం ఏయే వంటకాలు తయారు చేస్తున్నారో తనిఖీ చేశారు. కూరగాయలు, పప్పుతో సాంబారు, ఉడికించిన గుడ్డు సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ దృష్టికి ప్రధానోపాధ్యాయురాలు శారద తీసుకెళ్లారు. మొత్తం ఎందరు విద్యార్థులు చదువుతున్నారో వివరాలు అడగ్గా మొత్తం 807 మంది చదువుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… విద్యార్థులు తరగతి గదుల్లో నిత్యం జరిగే అన్ని పాఠాలకు సంబంధించి నోట్స్ తయారు చేసుకోవాలని సూచించారు. రోజు వాటిని చదవడం.. రాయడంతో వాటిపై పట్టు సాధిస్తారని పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement